యాక్షన్ ప్యాక్డ్ లవ్ డ్రామా “ప్రేమ కథ” – రివ్యూ

సినిమా పేరు : ప్రేమ కథ

నటీనటులు : కిషోర్ కేఎస్డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ : వాసు పెండెం

మ్యూజిక్ : రధన్

ఎడిటర్ : ఆలయం అనిల్

ఆర్ట్ డైరెక్టర్ : వీర మురళి

నిర్మాతలు : విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్,

కో ప్రొడ్యూసర్ : ఉపేందర్ గౌడ్ ఎర్ర

రచన దర్శకత్వం : శివశక్తి రెడ్ డీ

న్యూ ఇయర్ ఫస్ట్ వీక్ ఆడియెన్స్ ముందుకొచ్చింది “ప్రేమకథ”. కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు కాగా ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరించారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా థియేటర్స్ లోకి వచ్చిన “ప్రేమకథ” ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు ప్రేమ్ (కిషోర్ కేఎస్డీ). ప్రేమ్ తన స్నేహితుడి ప్రేమ వ్యవహారంలో హెల్ప్ చేసేందుకు వెళ్లినప్పుడు వారికి కామన్ ఫ్రెండ్ అయిన దియా సితెపల్లిని చూస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఆమె అమ్మాయిని ప్రేమిస్తాడు. ఫ్రెండ్ ప్రేమకు హెల్ప్ చేద్దామని వెళ్లిన ప్రేమ్ తానే ప్రేమలో పడిపోతాడు. ప్రేమ్ లవ్ ను ఆ అమ్మాయి అంగీకరించిందా? లేదా?. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమ్ ఏం చేశాడు?. వారి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

“ప్రేమకథ” సినిమా ఆద్యంతం రియాల్టీకి దగ్గరగా ఉంటూ మన చుట్టూ నిజంగానే ఒక కథను చూస్తున్నాం అనే ఫీల్ కలిగిస్తుంది. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు శివశక్తి రెడ్ డీ. ఈ మూవీలో ప్రేమ, స్నేహం, కుటుంబం వంటి అంశాలన్నీ కలిసి ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తాయి. లవ్ ఫీల్, ఎమోషనల్ సీన్స్, ఫన్, కామెడీ ఎలిమెంట్స్ వేటికవి ది బెస్ట్ అనేలా ఉన్నాయి. కథకు తగిన ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడంలో ఈ టీమ్ సక్సెస్ అయ్యారు. ప్రేమ్ క్యారెక్టర్ లో కిషోర్ ఇంప్రెసివ్ పర్ ఫార్మెన్స్ చేశాడు. హీరోయిన్ దియా అందంగా కనిపించడమే కాదు నటనలోనూ మెప్పిస్తుంది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. రాజ్ తిరందాసు, వినయ్, నేత్ర సపోర్టింగ్ రోల్స్ లో బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్లంతా “ప్రేమకథ” కోసం ఒక టీమ్ వర్క్ చేసినట్లు స్క్రీన్ మీద ఔట్ పుట్ చూస్తే తెలుస్తుంటుంది. కాంపాక్ట్ బడ్జెట్ లో ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా సినిమాను నిర్మించారు ప్రొడ్యూసర్స్ విజయ్, సుశీల్, శింగనమల కల్యాణ్. రథన్ పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. వాసు పెండెం సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను న్యాచురల్ గా చూపించింది. ఈ వీక్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరిని కంఫర్టబుల్ గా ఫ్యామిలీతో కలిసి చూసేందుకు “ప్రేమకథ” ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు.

రేటింగ్ : 3/5