రుద్ర వీణ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ సుభ శ్రీ రాయగురు!

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. అలాంటి సూపర్‌ హిట్‌ టైటిల్‌తో నూతన నటీనటులతో జి.మధుసూదన్‌రెడ్డి అనే దర్శకుడు ఇటీవలే ఓ సినిమాను తెరకెక్కించి ఈ నెల 28 వ తేదీన రిలీజ్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల హీరోగా నటించగా… శుభశ్రీ రాయగురు, ఎల్సా ఘోష్‌ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా అనౌన్స్ కావడంతోనే ‘రుద్రవీణ’పై ఓ మోస్తారు అంచనాలు ప్రజల్లో ఏర్పడ్డాయి. అలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడం పట్ల మూవీ టీమ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకు మంచి రివ్యూలు వస్తుండడంతో ఈ సినిమాలోని నటీనటుల గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో వీణ క్యారెక్టర్ లో నటించిన ” శుభ శ్రీ రాయగురు ” గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మంచి అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఎవరా అని గూగుల్ లో ఓ సెర్చ్ చేసేస్తున్నారు. ఆ బ్యూటీ గురించి కొన్ని వివరాలు మీకోసం… 2020 ఫెమినా మిస్ ఇండియా ఒడిశా టైటిల్ గెలుచుకొని సినిమా ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ.

నందమూరి కల్యాణ్ రామ్ , మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో వస్తున్న చిత్రంలో కూడా ఈ భామ ఛాన్స్ కొట్టేసింది. అలానే ఓ పిట్ట కధ, కేరింత చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వంత్ తో కూడా ఓ మూవీ చేస్తుంది శుభ శ్రీ. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది. మిస్కిన్ డైరెక్షన్ లో వస్తున్న ” డెవిల్ ” అనే చిత్రంతో కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఇలానే వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హెరోయిన్ రేంజ్ కి శుభ శ్రీ ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.