జనవరి 1, 2025 న మెగాస్టార్ చిరంజీవి “హిట్లర్” థియేటర్స్ లో రీ రిలీజ్ !!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘హిట్లర్’ మూవీ 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తన ఇమేజ్ కు భిన్నంగా ఐదుగురు చెల్లెలకు అన్నగా మెగాస్టార్ నటించిన ‘హిట్లర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.

ఇక ఈ మూవీని దాదాపు రిలీజ్ అయ్యి దాదాపు 27 ఏళ్లు పూర్తవుతుంది. 1997 జనవరి 4న ‘హిట్లర్’ మూవీ రిలీజ్ అయింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ మూవీని మళ్లీ జనవరిలోనే రీరిలీజ్ చేస్తున్నారు. 2025 జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా ‘హిట్లర్’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు సాయి సినీ చిత్ర బ్యానర్ వారు.

సూపర్ సాంగ్స్, ఎమోషన్స్ సీన్స్, కమర్సియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని కలిసిఉన్న ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు థియేటర్స్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.